News February 4, 2025

మేడ్చల్ జిల్లాలో రూ.29.56 కోట్ల రుణమాఫీ 

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ ఇప్పటి వరకు 4,371 మంది రైతులకు రూ.29.56 కోట్ల వరకు మేలు జరిగినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పథకాలను అమలు చేసేందుకు పకడ్బండిగా చర్యలు చేపడుతున్నట్లుగా మేడ్చల్ కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News March 17, 2026

గుండాల తహశీల్దార్ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

గుండాలలో నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ అంకిత్ మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా నిర్దిష్ట గడువులో కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

News March 17, 2026

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి కొండపల్లి

image

వ‌చ్చే ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యంగా పెట్టుకుని ప‌ని చేయాల‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (APEDB) నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో క‌లిసి ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పన కోసం అనేక సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

News March 17, 2026

ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కి ఫిఫా అదిరిపోయే గిఫ్ట్

image

2026 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఇప్పుడు యూట్యూబ్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ జూన్ 11 నుంచి జులై 19 వరకు జరిగే టోర్నీలో ప్రతి మ్యాచ్ మొదటి 10 నిమిషాలను బ్రాడ్‌కాస్టర్లు తమ యూట్యూబ్ ఛానల్స్‌లో లైవ్ స్ట్రీమ్ చేయొచ్చని ఫిఫా అనౌన్స్ చేసింది. అంతేకాకుండా కొన్ని సెలక్టెడ్ మ్యాచ్‌లను పూర్తిస్థాయిలో ఫ్రీగా చూసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈసారి WC అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనుంది.