News February 4, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔తెలంగాణపై అంత వివక్ష ఎందుకు:  దేవరకద్ర ఎమ్మెల్యే
✔సేవాలాల్ ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
✔పార్లమెంట్లో గళమెత్తిన ఎంపీ డీకే అరుణ
✔కేంద్ర బడ్జెట్ పై.. కాంగ్రెస్ నేతల నిరసన
✔రేపు ఉమ్మడి జిల్లాలో రథసప్తమి వేడుకలు
✔మొదటిరోజు ప్రశాంతంగా ప్రయోగ పరీక్షలు
✔పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలి:కలెక్టర్లు
✔ప్రజావాణి..సమస్యలపై నిఘా!
✔మాగనూర్:వాగులో పడి..యువకుడు మృతి
✔పేదలపై భారాన్ని మోపే కేంద్ర బడ్జెట్:CPM

Similar News

News February 12, 2026

MBNR: గోల్డ్ మెడల్ సాధించిన శ్రీజ

image

APలోని తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సౌత్ జోన్ షూటింగ్ బాల్‌లో మహమ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన శ్రీజ అద్భుత ప్రదర్శన కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈనెల 7 నుంచి జరిగిన సౌత్ జోన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని యువతకు స్ఫూర్తిగా నిలిచారు. గోల్డ్ మెడల్ సాధించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు.

News February 11, 2026

మహబూబ్‌నగర్ జిల్లాలో 69.5% ఓటింగ్ నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పురపాలికలు, 1 నగరపాలికలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69.05 ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దేవరకద్రలో 85.51 శాతం ఓటింగ్, భూత్పూర్‌లో 84.58 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అలాగే మహబూబ్‌నగర్ నగరపాలికలో 67.73% ఓటింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.

News February 11, 2026

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఏపీ జితేందర్ రెడ్డి

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం 44 డివిజన్ పంచాయితీ రాజ్ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.