News February 4, 2025
ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలు సహకరించాలి

ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెట్రి సెల్వి ఎమ్మెల్సీ ఎన్నికలపై సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11 పరిశీలన, ఫిబ్రవరి 13 ఉపసంహరణ, ఫిబ్రవరి 27 పోలింగ్ ఉంటుందన్నారు.
Similar News
News September 17, 2025
గద్వాల: నిధుల లేమితో సతమతమవుతున్న గ్రామ కార్యదర్శులు

గద్వాల జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో నిధుల లేమి కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో, పంచాయతీల నిర్వహణ భారమంతా కార్యదర్శులపై పడుతోంది. ఆర్థిక భారం గుదిబండగా మారడంతో కార్యదర్శులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని వారు తెలిపారు.
News September 17, 2025
తాడేపల్లి: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించింది. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పండితులు సీఎంను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News September 17, 2025
భువనగిరి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై న్యూ డైమెన్షన్ స్కూల్ సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. లూనాపై వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అనాజిపురానికి చెందిన బాలయ్య గౌడ్‌గా గుర్తించారు. అతను భువనగిరి వైపు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంతో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుడు కల్లుగీత కార్మికుడు. న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.