News February 4, 2025
ఎన్టీఆర్: క్రైమ్ పోలీసులకు రివార్డ్స్

NTR జిల్లాలో దొంగతనాల కేసులు తక్కువ సమయంలో చేదించిన పోలీసులకు నగదు రివార్డులతో ఎస్పీ రాజశేఖర్ బాబు అభినందించారు. సోమవారం విజయవాడలో విధి నిర్వహణలో విశేష ప్రతిభను కనబరిచిన పది మంది క్రైమ్ పోలీస్ అధికారులకు సిబ్బందికి నగదు వార్డులను అందించారు. నగదు రీవార్డ్ సాధించిన వారిలో స్వామి, సత్యనారాయణ,కృష్ణమూర్తి, ప్రకాష్ రావు, నాగరాజు, రవికుమార్, సురేష్, రమణ, షేక్ షబ్బీర్, శిరీష ఉన్నారు.
Similar News
News March 14, 2026
టెన్త్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత: MHBD ఎస్పీ

మహబూబాబాద్ జిల్లాలో ఈ నెల 14 నుంచి వచ్చే నెల 16 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ డా.శబరిష్ తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచామన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 14, 2026
ధైర్యంగా పరీక్షలు రాయండి.. విజయం మీదే: మంత్రి సీతక్క

14 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు మీ జీవితాన్ని నిర్ణయించే చివరి పరీక్షలు కావని.. మీ కష్టానికి మొదటి పరీక్ష అన్నారు. తల్లిదండ్రులు, గురువులు మీ విజయాన్ని చూడాలని ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా, ధైర్యంగా పరీక్ష రాయాలని పిలుపునిచ్చారు.
News March 14, 2026
సంగారెడ్డి: 233 ప్రభుత్వ పాఠశాలలకు నిధులు విడుదల

సంగారెడ్డి జిల్లాలోని 233 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం నిధులు విడుదల చేశారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద ఒక్కో పాఠశాలకు రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 4.66 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను పాఠశాల భవనాల్లోని అత్యవసర మరమ్మతుల కోసం మాత్రమే వినియోగించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


