News February 4, 2025
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి సీతక్క

ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్లకు అదనపు నిధులు మంజూరు చేయాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
Similar News
News March 29, 2026
NLG: బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ రూ.2500 !

జిల్లాలో గ్యాస్ కొరత అక్రమార్కులకు వరంగా మారింది. గతంలో 24 గంటల్లో వచ్చే సిలిండర్, ఇప్పుడు 15 రోజులు గడిచినా అందని పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు బ్లాక్ మార్కెట్‌లో డొమెస్టిక్ సిలిండర్‌ను రూ. 2500కు, కమర్షియల్ సిలిండర్‌ను ఏకంగా రూ.8000కు విక్రయిస్తూ సామాన్యులను నిలువునా దోచుకుంటున్నారు. గృహ అవసరాలకు రావాల్సిన కోటాను అక్రమంగా హోటళ్లకు మళ్లిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
News March 29, 2026
అత్తామామల బాధ్యత కోడలిపై ఉండదు: అలహాబాద్ హైకోర్టు

BNSS సెక్షన్ 144 లేదా CrPC సెక్షన్ 125 ప్రకారం కోడలు తన అత్తామామలను పోషించడానికి బాధ్యత వహించరని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. ‘సెక్షన్ 144 ప్రకారం మెయింటెనెన్స్ కోరే హక్కు కొందరికి ఉంది. అత్తామామలు ఆ పరిధిలోకి రారు. వారిని సంరక్షించాలనే నైతికత ఉన్నప్పటికీ చట్టపరమైన బాధ్యతగా అమలు చేయలేం’ అని పేర్కొంది. కొడుకు చనిపోయినందున కోడలు తమ బాగోగులు చూడాలంటూ వృద్ధులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
News March 29, 2026
మానవపాడు: 2760 మహిళలు ఓపెన్ 10వ తరగతి పరీక్షలు

మానవపాడు మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఓపెన్ 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. సుమారు 2760 మంది మహిళలు ఆదివారం పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాలను MEO శివప్రసాద్ పరిశీలించారు. మహిళలు రాయడం, చదువుతోపాటు కనీసం 10 పరీక్షలు రాయడం ద్వారా వారి విద్యా అభివృద్ధిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పరీక్షలను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.


