News February 4, 2025
తిరుమల: రథసప్తమి.. పోలీసులకు ఎస్పీ సూచనలు

TTD ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని జిల్లా హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సోమవారం బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందికి తిరుమల ఎస్.వి హై స్కూల్ గ్రౌండ్‌లో పలు సూచనలు చేశారు. పోలీసులు భక్తులతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. రథసప్తమి రోజున ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News March 1, 2026
అనంతపురంలో నేడే మెగా సెమినార్.. పేరెంట్స్ మీకోసమే!

10th తర్వాత విద్యార్థులు ఏ రూట్‌లో వెళితే ఫ్యూచర్ ఉంటుందనే దానిపై తల్లిదండ్రులు స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత కెరీర్ గైడెన్స్ సెమినార్లు నిర్వహిస్తున్నాయి. అనంతపురంలోని కమ్మ భవన్, హైదరాబాద్-బెంగళూరు హైవే, రామ్‌నగర్, రుద్రంపేటలో నేటి ఉదయం 10 AMలకు సదస్సు జరగనుంది. కార్యక్రమంలో JD లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. సో పేరెంట్స్ డోంట్ మిస్.
News March 1, 2026
ఖమ్మం: కుక్కకాటుపై ఆందోళన వద్దు: డీఎంహెచ్‌ఓ

ఖమ్మం జిల్లాలో కుక్కకాటు ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామారావు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా టీకాలు, మందులు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. ముజుగూడెం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఒకరిని ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప ఆస్పత్రిని సంప్రదించాలని సూచించారు.
News March 1, 2026
వికారాబాద్ జిల్లాలో నాటు తుపాకీ కలకలం

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్‌లో నాటు తుపాకీ కలకలం రేపింది. గ్రామంలో ఓ ఇంట్లో తుపాకి ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులకు సమాచారం అందగా, ఘటనా స్థలికి వెళ్లి ఇంటిని పరిశీలించారు. తుపాకీ లభ్యం కావడంతో పోలీసులకు సమాచారం అందించగా ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వన్యప్రాణుల వేట కోసం ఈ తుపాకీని కొనుగోలు చేసినట్లు సమాచారం.


