News February 4, 2025

అశ్వారావుపేట: ఎంపీటీసీ స్థానాల మార్పులకు కలెక్టర్ ఆమోదం

image

అశ్వారావుపేట పట్టణం మున్సిపాలిటీగా మారిన క్రమంలో ఎంపీటీసీ స్థానాల మార్పు అనివార్యమైంది. గతంలో మండల పరిధిలో 17ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11స్థానాలకు కుదిస్తూ రూపొందించిన ఫైల్‌పై జిల్లా కలెక్టర్ సంతకం చేసినట్టు అధికారులు ప్రకటించారు. అందుకు సంభందించి వివరాలను స్థానిక ఎంపీడీవో, తహసీల్దార్, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీసు బోర్డుపై ఉంచినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటన ద్వారా  తెలిపారు.

Similar News

News March 6, 2026

PDPL: యూపీఎస్సీలో 55వ ర్యాంక్.. సృజన ఐఏఎస్‌కు ఎంపిక

image

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు సెంటినరికాలనీకి చెందిన గుడెల్లి సృజన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2025లో 55వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. సింగరేణి ఉద్యోగి గుడెల్లి రాజేశం-రాణి దంపతుల కుమార్తె సృజన గతంలో గ్రూప్-1లో 35వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికై, ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఆమె విజయంపై తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం సహా పలువురు అభినందనలు తెలిపారు.

News March 6, 2026

‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ నెల్లూరు జిల్లాలో అవగాహన

image

జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చేందుకు ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీసులు భారీ నిఘా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి, 24 డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డ్రగ్స్ అమ్మినా లేదా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం ఉన్నవారు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా డయల్ 112 కి ఫిర్యాదు చేయాలని కోరారు.

News March 6, 2026

సీఎం పర్యటన ఏర్పాటు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

ఈ నెల 9న డోన్ మండలం కొత్త బురుజులో CM చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం డోన్‌లోని R&B అతిథి గృహంలో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. SP సునీల్ షొరాణ్, JC కొల్లాబత్తుల కార్తీక్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.