News February 4, 2025

అనకాపల్లి జిల్లాలో 98.07 శాతం పింఛన్లు పంపిణీ

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద అనకాపల్లి జిల్లాలో సోమవారం సాయంత్రం 6.10 గంటల వరకు 98.07 పింఛన్లను పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో లబ్ధిదారులు 2,57,457 మంది కాగా ఇప్పటివరకు 2,52,482 మందికి పింఛన్లను అందజేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 4,975 మందికి పింఛన్లు అందజేయాల్సి ఉందన్నారు.

Similar News

News February 24, 2026

బ్లడ్‌బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

image

ఏఐ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లు, నిఫ్టీ 287 పాయింట్లు కోల్పోయాయి. కొత్త ఫీచర్లతో దూసుకొస్తున్న ఏఐ టూల్స్ భయంతో ఇన్వెస్టర్లు ఐటీ షేర్లను భారీగా సేల్ చేస్తున్నారు. దీంతో టెక్ మహీంద్రా, HCL టెక్, ఇన్ఫోసిస్, TCS షేర్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత తగ్గడమూ మార్కెట్ నష్టాలకు కారణాలు.

News February 24, 2026

ఆర్డీటీ కోసం పోస్ట్‌కార్డుల ఉద్యమం: అనంత వెంకట్రామిరెడ్డి

image

ఆర్డీటీకి FCRA అనుమతులు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 10 నుంచి ‘పోస్ట్‌కార్డుల ఉద్యమం’ చేపట్టనున్నట్లు జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యవల్ చేయకపోతే పేదలకు అందే సేవలు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తలారి రంగయ్య నాయకత్వంలో లక్షలాది మందితో ప్రధాని మోదీకి పోస్ట్‌కార్డులు పంపి నిరసన తెలపనున్నట్లు ఆయన ప్రకటించారు.

News February 24, 2026

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: SP

image

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 163BNSS (144) సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. సెంటర్ల వద్ద మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తామన్నారు.