News February 4, 2025
MNCL: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

2024- 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్‌ను ప్రవేశపెడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి జనవరి వరకు 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మిగతా 18.27 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ అందించనున్నారు.
Similar News
News March 22, 2026
వరంగల్ మార్కెట్ రేపు పునః ప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. నిన్న రంజాన్, ఈరోజు వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News March 22, 2026
గద్వాల: రోడ్డు ప్రమాదం.. మృతులు కర్ణాటక వాసులు

బలిగేర శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వరికోత పనులు ముగించుకుని బైక్‌పై వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొన్నారు. మృతులు దేవునిపల్లికి చెందిన తిమ్మప్ప (35), ఓగులప్ప (40)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 22, 2026
VZM: విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు

విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. పరీక్షల అనంతరం ఖాళీ సమయంలో కొంతమంది విద్యార్థులు చెరువులు, కాల్వలు వంటి జలవనరుల వద్దకు వెళ్లే అవకాశముండడంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలకు ముందుగానే హెచ్చరికలు ఇవ్వాలని ఆయన కోరారు.


