News February 4, 2025

అమరావతి రైల్వే లైన్ నాలుగేళ్లలో పూర్తి: నరేంద్ర పాటిల్

image

AP: ఈ ఏడాది JAN నాటికి విజయవాడ రైల్వే డివిజన్‌లో ₹4,856Cr ఆదాయం వచ్చిందని డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ చెప్పారు. బెజవాడ రైల్వే స్టేషన్ ఏడాదికి ₹500Cr ఆదాయం సాధిస్తోందన్నారు. ₹2,545Crతో ఎర్రుపాలెం-నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. దీంతో అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడుతుందన్నారు.

Similar News

News February 4, 2025

EAPCET.. ప్రతి అభ్యంతరానికి రూ.500

image

TG: <<15348696>>ఈఏసీసెట్‌కు<<>> సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్ష తర్వాత విడుదల చేసే కీలో అభ్యంతరాలు లెవనెత్తాలంటే విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు రూ.500 చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. వారి అబ్షక్షన్ సరైనదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగిస్తారు. హేతుబద్ధత లేకుండా వందల సంఖ్యలో అభ్యంతరాలు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఫ్రీగానే అబ్షక్షన్‌ను వ్యక్తపరిచే అవకాశం ఉండేది.

News February 4, 2025

ఈ నెలలోనే గ్రూప్స్ ఫలితాలు?

image

TG: గ్రూప్-1తో సహా గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను ఈనెలాఖరులోగా విడుదల చేసేందుకు TGPSC కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా <<15352858>>గ్రూప్-1<<>> జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసి, తర్వాత గ్రూప్-2, గ్రూప్-3 రిజల్ట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల గ్రూప్-1 జాబ్ వచ్చిన వాళ్లు మిగతా రెండింటికి ఎంపికైనా వదులుకుంటారు. దీంతో బ్యాక్‌లాగ్ పోస్టులు మిగిలే ఛాన్స్ ఉండదని అధికారులు భావిస్తున్నారు.

News February 4, 2025

పెన్షన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు

image

AP: ఉదయం 5, 6 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సిన అవసరం లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు వస్తుండటంతో ఆయన స్పందించారు. అనవసర నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దని, ఉ.7 నుంచి సా.6 లోపు పంపిణీ పూర్తి చేస్తే సరిపోతుందని చెప్పారు. ఇంటి వద్ద కాకుండా ఇతర ప్రాంతాల్లో పెన్షన్ ఇస్తున్నట్లు తేలితే కారణాలు తెలుసుకోవాలన్నారు. లబ్ధిదారులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.