News February 4, 2025
సిద్దిపేటలో 14 మందికి జరిమానా
సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన 14 మందికి రూ.22,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కాంతారావు తీర్పునిచ్చినట్లు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహించి 14 మందిని అరెస్ట్ చేశారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించినట్లు వెల్లడించారు.
Similar News
News February 4, 2025
PGECET, ICET షెడ్యూల్ ఇదే
TG: ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే PGECET నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానుంది. అదే నెల 17-19 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు ఉండనున్నాయి.
☛ MBA, MCA తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET నోటిఫికేషన్ మార్చి 6న రిలీజ్ కానుంది. అదే నెల 10 నుంచి మే 3 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. జూన్ 8, 9న పరీక్ష ఉంటుంది.
News February 4, 2025
తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది: పెద్దారెడ్డి
తనను తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య అంటూ తనను వెళ్లనివ్వట్లేదని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలను సొంత నియోజకవర్గంలోకి వెళ్లకుండా ఎక్కడా అడ్డుకోవడం లేదని తెలిపారు. జేసీ కారణంగా తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని విమర్శించారు.
News February 4, 2025
తిరుపతి: రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకి ప్రాక్టీకల్ పరీక్షలు జరగనున్నాయి. జనరల్ 24,927 మందికి 124 కేంద్రాలు, ఓకేషనల్ 2,355 మందికి 23 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు వివిధ సెషన్స్‌గా పరీక్షలు ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని వివరించారు.