News February 4, 2025
ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: దంతాలపల్లి MPDO

దంతాలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వివేక్ రామ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీఓ అప్సర్ పాషా, సెక్రటరీలు మోడెం మధు, సృజన, నాగరబోయిన శ్రీధర్, సతీష్, అజయ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News January 4, 2026
VKB: 630 కుక్కలకు స్టెరిలైజేషన్: ఏసుదాస్

పట్టణంలో 630 వీధి కుక్కలను పట్టి వాటికి స్టెరిలైజేషన్ చేసి ఆహారం అందిస్తున్నామని వికారాబాద్ మునిసిపల్ ఇన్‌ఛార్జి శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ఏసుదాస్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని జనన నియంత్రణ కేంద్రంలో ఆపరేషన్లు చేసిన కుక్కలకు ఆహారం అందించారు. కుక్కలను నియంత్రించేలా వాటి సంఖ్యను పెరగకుండా ఆపరేషన్లు చేసి వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించి వదిలిపెడతామని తెలిపారు.
News January 4, 2026
గన్నవరం చేరకున్న అశోక గజపతి రాజు

గోవా గవర్నర్ అశోక గజపతి రాజు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఆయనకు విమానాశ్రయ లాంజ్‌లో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం లభించింది. గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, ఇతర జిల్లా అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించారు. విమానాశ్రయం వెలుపల పోలీసు భద్రత మధ్య ఆయన కొద్దిసేపు అధికారులతో ముచ్చటించారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
News January 4, 2026
KNR: డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ, ఉచిత వైద్య శిబిరం

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం KNR జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో 200 మంది డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డీటీసీ పి.పురుషోత్తం మాట్లాడుతూ.. ఆరోగ్యవంతులైన డ్రైవర్లతోనే సురక్షిత ప్రయాణం సాధ్యమన్నారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన వారికి సీపీఆర్ ద్వారా ప్రాణదానం చేయవచ్చని డాక్టర్ ప్రణవ్ వివరించారు. శిబిరంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు, జనరల్ చెకప్ నిర్వహించారు.


