News February 4, 2025
మార్చ్ 12న PGECET- 2025 నోటిఫికేషన్
తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -2025 నోటిఫికేషన్‌ను మార్చు 12వ తేదీన విడుదల చేయనున్నట్లు పీజీ సెట్ కన్వీనర్ అరుణకుమారి తెలిపారు. దీనిలో భాగంగా నేడు కమిటీ మీటింగ్‌ను ఉన్నతాధికారులతో కలిసి ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చ్ 17 నుంచి మే 19 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని అన్నారు. జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
Similar News
News February 4, 2025
ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా రెడీ: మందకృష్ణ
TG: ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏదైనా జరగవచ్చన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వారసత్వ ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు. గత 30 ఏళ్లలో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలగలేదని తెలిపారు. మరోవైపు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసే అవకాశముంది.
News February 4, 2025
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు
చర్ల మండలం తాళిపేరు ప్రాజెక్టు తిప్పాపురం రోడ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా ఓ యువకుడు మృతి చెందాడని స్థానికులు చెప్పారు. మరో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఛత్తీస్గడ్ రాష్ట్రం జీడిపల్లికి చెందిన ముగ్గురు యువకులు, తిప్పాపురం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఉన్నట్లు వెల్లడించారు.
News February 4, 2025
GNT: నగ్న చిత్రాల పేరుతో రూ.2.53 కోట్లు స్వాహా.. అరెస్ట్
అశ్లీల వీడియోల పేరుతో బెదిరించి తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన యువతి నుంచి రూ.2.53 కోట్లు కాజేసిన దేవనాయక్‌ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు నిడదవోలు సీఐ తిలక్ సోమవారం తెలిపారు. యువతి HYD విప్రోలో ఉద్యోగం చేస్తోంది. తన వద్ద యువతి నగ్న చిత్రాలు ఉన్నాయని వాటిని ఇంటర్నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. నిందితుడి నుంచి రూ. 1.84 కోట్లు నగదు, ఆస్తులను సీజ్ చేశామన్నారు.