News February 4, 2025
KMR: 59 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన పేర్కోన్నారు. 16417 పట్టభద్రుల, 2125 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నాట్లు వివరించారు. ఓటర్లను ప్రభావితం చేయకూడదని సూచించారు.
Similar News
News November 8, 2025
కాజీపేట, వరంగల్ మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లలో బెర్తులు..!

కాజీపేట, వరంగల్ మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. నవంబర్ 9న చర్లపల్లి-ధానాపూర్(07049), 12న చర్లపల్లి-తిరుచనూర్(07251), 13న తిరుచనూర్-చర్లపల్లి(07252) ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్‌లో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రయాణికులు రిజర్వేషన్ సౌకర్యాన్ని వెంటనే వినియోగించుకోవాలని సూచించారు.
News November 8, 2025
NEEPCLలో 98 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NEEPCL)లో 98 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ITI, డిప్లొమా, డిగ్రీ , బీటెక్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా NAPSలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: neepco.co.in/
News November 8, 2025
జిల్లేడు పూలతో గణపతి పూజ ఎందుకు చేయాలి?

గణపతి పూజలో జిల్లేడాకు, పూలు చాలా కీలకం. ఇవి సకల శుభాలకు మూలమని నమ్మకం. వీటితో గణపతిని ఎలా పూజించాలో పండితులు ఇలా వివరిస్తున్నారు. పీటను శుభ్రం చేసి, బియ్యప్పిండి ముగ్గేసి, గంధం, బొట్లు పెట్టి, 21 జిల్లేడాకులను అమర్చాలి. వాటి నడుమ గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆయనకెంతో ఇష్టమైన జిల్లేడు పూల మాల వేసి, ఆ పూలతోనే పూజ చేయాలి. ఇలా ఆయనను పూజిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడని, శుభం చేకూరుస్తాడని నమ్మకం.


