News February 4, 2025
NGKL: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధిదారులు ఎంపిక

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,284 మంది రైతులను అధికారులు ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు రెండు విడతల్లో 12 వేల రూపాయలను ఇస్తామని ప్రకటించింది. మొదటి విడత ఎకరాకు 6 వేల చొప్పున నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రేషన్ కార్డు కలిగి ఉన్న రైతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పథకంలో పని చేసి ఉన్న వారిని ఎంపిక చేశారు.
Similar News
News March 17, 2026
నల్గొండ: ఊరి శివారులో యువకుడి మృతదేహం

శాలిగౌరారం మండలం కొండారం శివారులో రోడ్డు పక్కన ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఉదయం బావుల వద్దకు వెళ్లిన రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News March 17, 2026
హైదరాబాద్‌లో UK స్కూల్స్!

TG: హైదరాబాద్‌లో యునైటెడ్ కింగ్‌డమ్(UK)కు చెందిన 13 ప్రఖ్యాత స్కూల్స్ తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. ఇందులో భాగంగా యూకే డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 18న రాష్ట్రంలో పర్యటించనుంది. ఎక్కడెక్కడ క్యాంపస్‌లు నెలకొల్పాలనే దానిపై రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరపనుంది.
News March 17, 2026
నల్గొండ వాసికి అంతర్జాతీయ గౌరవం

నల్గొండకి చెందిన సైబర్ భద్రత నిపుణుడు వెంకట్ రమణరావు అదోనికి అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న అకడమిక్ కౌన్సిల్ ఆన్ యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ నిర్వహించే 39వ వార్షిక సమావేశంలో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో తన పరిశోధనా పత్రాన్ని ప్రదర్శించనున్నారు. సమావేశం జూలై 1 నుంచి 3 వరకు పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో జరగనుంది.


