News February 4, 2025

సంగారెడ్డి: ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు

image

సంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు ఐదు రోజుల సీసీఎల్ మంజూరు చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సాధారణ సెలవు దినాల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఇవి వర్తిస్తాయన్నారు. దీంతో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈవోకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 4, 2025

దివ్యాంగులకు ఊరట.. ఆ నిబంధన తొలగింపు

image

రాత పరీక్షల విషయంలో దివ్యాంగులకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. పరీక్షల్లో రాత సహాయకులను పొందేందుకు 40% వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. ఎలాంటి ప్రామాణికం లేకుండా వికలాంగులందరూ పరీక్ష రాయడానికి స్క్రైబ్‌లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. 2022, ఆగస్టు 10న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంను పునఃసమీక్షించాలని, ఆంక్షలను తొలగించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.

News February 4, 2025

బాపట్ల: నందిగం సురేశ్‌కు ధైర్యం చెప్పిన జగన్

image

విదేశీ పర్యటన ముగించుకొని మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ బాపట్ల మాజీ ఎంపీ నందింగం సురేశ్‌ను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కార్యక్రమంలో అంబటి, పేర్నినాని, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.

News February 4, 2025

 రెండు రోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతి

image

కల్లూరు మండల పరిధిలోని లింగాల గ్రామ మాజీసర్పంచ్ మట్టూరి సీతారత్నం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. రెండు రోజుల క్రితం ఈమె భర్త మట్టూరి భద్రయ్య మృతి చెందాడు. రెండురోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతి చెందడంతో లింగాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.