News February 4, 2025

కులగణన: నేడు క్యాబినెట్, అసెంబ్లీ సమావేశం

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ ఉ.10 గంటలకు సమావేశం కానుంది. కుల గణన సర్వే నివేదికకు ఆమోదం తెలపనుంది. ఉ.11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సర్వేపై చర్చించనుంది. కులగణన తప్పుల తడక అంటూ బీసీ సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాగా ఈ నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Similar News

News April 7, 2026

చావుకు మరో ఏడాది దగ్గరయ్యా: ఆర్జీవీ

image

నేడు తన పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇవాళ నేను చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను. కాబట్టి ఏవో కారణాల వల్ల సంతోషం కలిగితే తప్ప మనం సంబరాలు చేసుకోవద్దు. థాంక్స్’ అంటూ రాసుకొచ్చారు.

News April 7, 2026

తండ్రి కాబోతున్న స్టోయినిస్

image

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ తండ్రి కాబోతున్నారు. తన ఫియాన్సీ సారా జార్నుచ్ త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘నీలో సగం.. నాలో సగం’ అంటూ స్కానింగ్ రిపోర్టు ఫొటోను షేర్ చేశారు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ గతేడాది సెప్టెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. స్టోయినిస్ IPLలో ప్రస్తుతం PBKS జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే.

News April 7, 2026

CSK మెంటార్‌గా రావాలన్న ఫ్యాన్.. కెవిన్ రిప్లై అదుర్స్!

image

CSK టీమ్‌కు మెంటార్‌గా రావాలన్న ఓ అభిమాని విజ్ఞప్తిపై ఇంగ్లండ్ మాజీ స్టార్ బ్యాటర్ పీటర్సన్ ఆసక్తికరంగా స్పందించారు. ‘తప్పకుండా వస్తాను.. చెన్నై అయితే మాల్దీవులకు దగ్గరగా ఉంటుంది. సులభంగా రావొచ్చు’ అంటూ చమత్కరించారు. కాగా ఆయన తరచూ మాల్దీవుల ట్రిప్‌కు వెళ్తుంటారు. వరుస ఓటములతో సతమతమవుతున్న జట్టును గెలిపించేందుకు పీటర్సన్‌ను చేర్చుకోవాలని పలువురు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?