News February 4, 2025
8th, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు

AP: గురుకుల విద్యాలయాలలో 2025-26కుగాను ఎనిమిదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 7th, టెన్త్ ఉత్తీర్ణులైన వారు మార్చి 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష లోపు ఉండాలి. మార్చి 4న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. 9న పరీక్ష ఉంటుంది. 25న మెరిట్ జాబితా ప్రకటిస్తారు. ఏప్రిల్ 11, 21 తేదీల్లో రెండు దశల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం <
Similar News
News April 10, 2026
శాంతి చర్చల వేళ.. పాక్vsఇజ్రాయెల్

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల వేళ పాక్, ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దుష్ట, క్యాన్సర్ దేశమని పాక్ రక్షణ మంత్రి ఖవాజా విమర్శించారు. గాజా, లెబనాన్‌లో మారణ హోమం చేస్తోన్న ఆ దేశాన్ని నాశనం చేయాలన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. మీడియేటర్‌గా ఇలాంటి కామెంట్లు దారుణమంది. ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకుంటుందని పేర్కొంది.
News April 10, 2026
కాసేపట్లో క్యాబినెట్ భేటీ.. అమరావతిపై కీలక చర్చ

AP: సీఎం CBN అధ్యక్షతన ఈ ఉదయం 10.30గంటలకు క్యాబినెట్ భేటీ కానుంది. ముందుగా అమరావతి చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి క్యాబినెట్ ధన్యవాదాలు తెలపనుంది. ఆపై రాజధానిలో నిర్మాణాలపై చర్చ జరగనుంది. 16వ SIPB సమావేశంలో చర్చించిన ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో 28 జిల్లాల ఆధారంగా జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపైనా చర్చ జరగనుంది.
News April 10, 2026
ఎండాకాలం.. వేడి సీటుపై కూర్చుంటున్నారా?

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడానికి ‘వేడి’ ప్రధాన శత్రువు. హెల్తీ స్పెర్మ్ కోసం వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2°C- 3°C తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకోవడం, టైట్ జీన్స్ ధరించడం, వేడి సీట్లపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వీర్యకణాల నాణ్యత, కదలిక మందగిస్తాయి. ల్యాప్‌టాప్‌ను నేరుగా ఒడిలో పెట్టుకోకండి. కాటన్ లోదుస్తులు ధరించండి. బైక్ సీటు చల్లబడిన తర్వాతే కూర్చోండి.


