News February 4, 2025

టెన్త్ ప్రీఫైనల్.. ఏపీ, టీజీ షెడ్యూల్ ఇలా

image

APలో ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు టెన్త్ క్లాస్ ప్రీఫైనల్ <<14926648>>పరీక్షలు<<>> నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. లాంగ్వేజెస్, మ్యాథ్స్ ఉ.9.30-మ.12.45 వరకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పేపర్లకు ఉ.9.30-11.30 వరకు జరుగుతాయి. TGలో మార్చి 6 నుంచి 15 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మ.12.15-3.15 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. పిల్లలకు మ.12.15లోపే భోజనం అందించాలని ఆదేశించారు.

Similar News

News March 23, 2026

రాష్ట్రంలో 11వేలకుపైగా హెక్టార్లలో పంట నష్టం

image

AP: అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలోని 11,337 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 15 జిల్లాల్లోని 9,950 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 9 జిల్లాల్లోని 1,387 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వరి 2,650 హెక్టార్లు, మొక్కజొన్న 6,450 హెక్టార్లు, మినుముకు 485 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. మరోవైపు యుద్ధంతో ఎగుమతులు తగ్గి రాయలసీమలో కమలాపండు పంట ధర టన్ను ₹10వేలు తగ్గి ₹22వేలకు చేరింది.

News March 23, 2026

డర్టీ బాంబ్.. ఇరాన్ ఆఖరి అస్త్రం ఇదేనా?

image

సాధారణ పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక వ్యర్థాలను కలిపి చేసేదే ‘డర్టీ బాంబ్’. ఇది అణుబాంబులా భారీ విస్ఫోటం సృష్టించకపోయినా రేడియేషన్‌ను గాలిలో వ్యాపింపజేసి ప్రాంతాన్ని విషపూరితం చేస్తుంది. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం తగినంత ఉండటంతో దీని తయారీ సాధ్యమేనని నిపుణులు భావిస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇరాన్‌ ఈ డర్టీ బాంబును ఆఖరి అస్త్రంగా వాడే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

News March 23, 2026

ఏప్రిల్ 2 నుంచి JEE మెయిన్ సెషన్-2 ఎగ్జామ్స్

image

JEE మెయిన్-2026 చివరి విడత (సెషన్-2) పరీక్షల షెడ్యూల్‌ను NTA ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగానే తెలుసుకునేలా ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్స్’ను NTA విడుదల చేసింది. అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేసి వెబ్‌సైట్ నుంచి ఈ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు పరీక్షకు కొన్ని రోజుల ముందు వస్తాయి.