News February 4, 2025

మగవారికీ పొదుపు సంఘాలు.. అనూహ్య స్పందన

image

AP: ఇన్నాళ్లూ మహిళలకు పరిమితమైన పొదుపు సంఘాలను మెప్మా పురుషులకూ విస్తరిస్తోంది. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 2,841గ్రూపులను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకోగా నెల రోజుల్లోనే 1,028సంఘాలు ఏర్పడ్డాయి. మార్చి 31 నాటికి టార్గెట్‌ను చేరుకునేలా అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీగార్డులకు ఆర్థిక స్వావలంబన కోసం పొదుపు సంఘాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.

Similar News

News February 4, 2025

అసెంబ్లీ వాయిదా.. హరీశ్ ఫైర్

image

TG: అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించిన కాసేపటికే వాయిదా వేయడంపై BRS MLA హరీశ్‌రావు ఫైరయ్యారు. ‘అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయటం ఏంటి? క్యాబినెట్ సమావేశం కొనసాగుతుందని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు ప్రభుత్వంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?’ అని ఎద్దేవా చేశారు.

News February 4, 2025

దూరమై ఒక్కటైన వేళ.. ఉద్వేగ క్షణాలు!

image

మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివెళ్లగా రద్దీ కారణంగా చాలా మంది తప్పిపోతున్నారు. అలాంటి వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఫాఫా మౌ జంక్షన్ రైల్వే స్టేసన్‌లో ఓ మహిళ తప్పిపోగా.. ఆమెను తన భర్తతో కలిపేందుకు రైల్వే పోలీసులు అవిశ్రాంతంగా శ్రమించి, అనౌన్స్‌మెంట్స్ ఇచ్చి ఎట్టకేలకు ఒక్కటి చేశారు. ఆ సమయంలో వారు ఉద్వేగానికి లోనై అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఫొటో వైరలవుతోంది.

News February 4, 2025

అమెరికా x చైనా: యుద్ధం మొదలైంది!

image

రెండు అతిపెద్ద ఎకానమీస్ మధ్య ట్రేడ్ వార్ మళ్లీ మొదలైంది. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్స్ దాడి ఆరంభించింది. అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గు, LNG ఉత్పత్తులపై 15%, క్రూడాయిల్, వ్యవసాయ యంత్రాలు, పెద్ద కార్లు, పికప్ ట్రక్స్‌పై 10% సుంకాలు ప్రకటించింది. Feb 10 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. చైనా ఉత్పత్తులపై ట్రంప్ వేసిన 10% టారిఫ్స్ శనివారం నుంచి అమల్లోకి రావడంతో ప్రతీకారానికి దిగింది.

error: Content is protected !!