News February 4, 2025
తూ.గో: నగ్నా చిత్రాలు పేరుతో రూ.2.53 కోట్లు స్వహ

ఆశ్లీల వీడియోల పేరుతో బెదిరించి నిడదవోలు శాంతి నగర్‌కు చెందిన యువతి నుంచి రూ.2.53 కోట్లు కాజేసిన నినావత్ దేవనాయక్‌ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు సీఐ తిలక్ సోమవారం విలేకరులకు తెలిపారు. యువతి HYD విప్రోలో ఉద్యోగం చేస్తోంది. తన వద్ద యువతి నగ్న చిత్రాలు ఉన్నాయని వాటిని ఇంటర్నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడన్నారు. నిందితుడి నుంచి 1.84 నగదు, స్థిరాస్తులను సీజ్ చేశామన్నారు.
Similar News
News March 18, 2026
NLG: కొండెక్కిన కోడి ధరలు.. చేపలకు భారీ డిమాండ్

ఉమ్మడి NLG జిల్లాలో చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. కోడి ధర రూ.300కు చేరుకోగా, స్కిన్‌లెస్ చికెన్ రూ.350 వరకు ఉంది. నాటుకోడి ధర రూ.700-750 మధ్య పలుకుతోంది. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా చేపలవైపు మొగ్గు చూపుతున్నారు. వాటి ధర కిలో రూ.150 నుంచి ప్రారంభమవుతున్నాయి. వేసవి, రంజాన్,పెళ్లిళ్ల సీజన్‌తో డిమాండ్ పెరగడంతో పాటు కోళ్ల సరఫరా తగ్గడం, దాణా రవాణా ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.
News March 18, 2026
కడపలో నేడు మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కడపలోని నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందు జరగనుంది. కాగా ముస్లిం సోదరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం గురువులు పాల్గొంటారన్నారు.
News March 18, 2026
నాగార్జునసాగర్ నీటిమట్టం 535 అడుగులు

నాగార్జునసాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుండగా ప్రస్తుతం 535.90 అడుగుల మేర నీరుంది. నీటి నిల్వ 179.89 టీఎంసీలుగా నమోదైంది. కుడి కాలువ ద్వారా 8023 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8541 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మెయిన్ పవర్ హౌస్ నుంచి 4046 క్యూసెక్కులు విడుదలవుతుండగా, మొత్తం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 22910 క్యూసెక్కులుగా ఉంది.


