News February 4, 2025

కాకినాడ: అదృశ్యమైన బాలుడు రైలులో దొరికేశాడు

image

కాకినాడ మధురానగర్‌కు చెందిన సత్యసాయి సృగ్విన్ (16) సోమవారం తెల్లవారుజామున అదృశ్య మైనట్లు ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు అందింది. కాగా ఈ బాలుడు విశాఖ వెళుతున్న ట్రైన్‌లో ఉండగా గుర్తించిన ఓ వ్యక్తి ఆ బాలుడిని గుర్తించి ఇంద్రపాలెం పోలీసులకు అప్పగించారు. దీంతో కథ సుఖంతమైంది. ఎస్ఐ, బాలుడి తల్లిదండ్రులు అతడిని అభినందించారు. ఆ బాలుడు అదృశ్యంపై ఎస్‌ఐ వీరబాబు విస్తృత ప్రచారం చేయడంతో అతడు దొరకాడు. 

Similar News

News March 28, 2026

యుద్ధంలో ఇరాన్‌కు రోజుకు ₹1,319 కోట్ల ఆదాయం

image

ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభం ఇరాన్‌కు వరంగా మారింది. హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించిన ఆ దేశం ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ ద్వారా రోజుకు ₹1,319 కోట్ల ఆదాయాన్ని గడిస్తోంది. ఇతర గల్ఫ్ దేశాలు రవాణా చేయలేక సతమతమవుతుంటే ఇరాన్ మాత్రం రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తూ లాభపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, ఇరాన్ మౌలిక సదుపాయాలు సేఫ్‌గా ఉండటంతో ఆ దేశానికి ఆర్థికంగా కలిసొస్తోంది.

News March 28, 2026

అమరావతిలో అత్యవసర సేవల లోపం బహిర్గతం

image

అమరావతిలో అత్యవసర సేవల లోపం బయటపడింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల్లో రూ.19 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం జరిగిన ఘటనకు ఫైర్ ఇంజన్ 50 నిమిషాల తర్వాత చేరింది. మరో ఘటనలో కూడా స్పందన ఆలస్యం కనిపించింది. సమయానికి సహాయం అందక నష్టం పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. రాజధాని అభివృద్ధి జరుగుతున్నా, భద్రతా సదుపాయాలు మెరుగుపర్చాలని ప్రజలు కోరుతున్నారు.

News March 28, 2026

చెన్నైకి బిగ్ షాక్.. 2 వారాలు ధోనీ దూరం

image

ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSKకు బిగ్ షాక్ తగిలింది. కండరాల గాయంతో బాధపడుతున్న మాజీ కెప్టెన్ ధోనీ మొదటి 2 వారాలు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది.