News February 4, 2025
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం

కొత్తపల్లి మండలం నేమం గెస్ట్ హౌస్ సమీపంలో బీచ్ రోడ్‌లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి నిస్సహాయ స్థితిలో పడిఉన్నారు. స్థానికుల వివరాల మేరకు.. సోమవారం వేగంగా వెళుతున్న ప్రగతి కాలేజ్ బస్సు రెండు బైక్‌లను ఢీకొంది. దీంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఉప్పాడకు చెందిన అబ్రాహాముగా స్థానికులు గుర్తించారు. క్షతగాత్రులను 108 లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 18, 2025
స్వచ్ఛతా హీ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టబోయే స్వచ్ఛతా హీ సేవా 2025 వాల్ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలెక్టరేట్‌లో బుధవారం ఆవిష్కరించారు. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో జిల్లా ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామ పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
News September 18, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

➤ టెక్కలి, జలుమూరు, పాతపట్నం, పొందూరు, శ్రీకాకుళానికి నూతన ఎంపీడీఓలు
➤అరసవల్లి: ఘనంగా ఆదిత్యుని కళ్యాణం.
➤అధ్వానంగా ముంగెన్నపాడు రోడ్డు.
➤ శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల విశ్వకర్మ జయంతి.
➤నరసన్నపేట: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు.
➤ఇచ్ఛాపురంలో గంజాయితో ఇద్దరు అరెస్ట్.
➤శ్రీకాకుళం: వైసీపీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం
➤ మా శత్రువు టీడీపీనే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
News September 18, 2025
కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో రేపటి నుంచి వందే భారత్ హాల్టింగ్: శ్రీధర్

కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో రేపటి నుంచి వందే భారత్ రైలు హాల్టింగ్ ఇవ్వనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ.శ్రీధర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి ప్రతిరోజు మ.3:15 గంటలకు కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ ఉండనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నాగేశ్ సికింద్రాబాద్-నాగపూర్ వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు.