News February 4, 2025
వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం: బాలకృష్ణ

వైసీపీ హయాంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, అభివృద్ధి అంటే ఏమిటో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికే హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. వార్డులను అభివృద్ధి చేసుకోవాలని సంకల్పించి స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి కౌన్సిలర్లు టీడీపీలో చేరారని అన్నారు.
Similar News
News November 10, 2025
పటాన్చెరు: సీఐటీయూ జిల్లా కోశాధికారిగా రాజయ్య

సీఐటీయూ జిల్లా కోశాధికారిగా రాజయ్యను నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మల్లేశం తెలిపారు. రాజయ్య మాట్లాడుతూ.. తనను జిల్లా కోశాధికారిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని పేర్కొన్నారు.
News November 10, 2025
మెగాస్టార్ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్!

స్వింగ్ జరా, కావాలయ్యా వంటి సూపర్‌హిట్ సాంగ్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు టాక్. ప్రత్యేక సెట్లో సాంగ్ షూట్ చేయడానికి అనిల్ రెడీ అవుతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News November 10, 2025
అందెశ్రీ అస్తమయం.. ఇందూరుతో ప్రత్యేక అనుబంధం

జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన ప్రముఖ కవి ‘అందెశ్రీ’కి నిజామాబాద్ జిల్లాతో అనుబంధం ఉంది. అందె ఎల్లయ్య (అందెశ్రీ) కొన్ని సంవత్సరాల క్రితం జిల్లాలోని మాక్లూర్ మండలంలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. ఆ సమయంలో అమ్రాద్‌లో శంకర్ మహరాజ్ వద్ద శిష్యరికం చేశారు. ఆ సమయంలోనే సమాజాన్ని అర్థం చేసుకునే తత్వం అలవాటైందని, కవిత్వం సైతం ఇందూరులోనే నేర్చుకున్నానని ఆయన తరచూ చెప్పేవారు.


