News February 4, 2025

యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ఛార్జ్‌పై IVR సర్వే

image

యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుపై అధిష్టానం IVR సర్వే చేపట్టింది. గూడూరి ఎరిక్షన్ బాబు పనితీరుపై మీ అభిప్రాయం తెలియజేయండి అంటూ నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు ఫోన్‌లు రావడంతో నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అధిష్టానం సర్వే నిర్వహిస్తుందని, అందులో భాగంగానే యర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ పనితీరుపై సర్వే జరుగుతుందని ఈ పార్టీ శ్రేణులు తెలుపుతున్నాయి.

Similar News

News January 17, 2026

మార్కాపురం జేసీ బాధ్యతలు స్వీకరణ

image

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న శ్రీనివాసులుకు అధికారుల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిటీ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

News January 17, 2026

నేడు దర్శి రానున్న మంత్రులు

image

దర్శిలో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. వీరితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, దర్శి ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరుకానున్నారు.