News February 4, 2025

సత్తా చాటిన చుండూరు ఎడ్లు

image

పల్నాడు జిల్లా రెంటచింతలలో జరుగుతున్న బండలాగుడు పోటీలలో చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన ఎడ్లు సత్తా చాటాయి. జూనియర్ విభాగంలో వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శివకృష్ణకు చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటాయి. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన రోహన్ బాబుకు చెందిన ఎడ్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

Similar News

News April 18, 2026

సంతమాగులూరులో కుళ్లిన మృతకళేబరం కలకలం

image

సంతమాగులూరు మండలంలోని కొప్పరం నుంచి సజ్జాపురం వెళ్లే మార్గంలో ఉన్న చెరువులో కుళ్లిన కళేబరం శుక్రవారం కలకలం రేపింది. ఎముకుల గూడుతో ఉన్న డెడ్‌బాడీని పశువుల కాపరి చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. అనంతరం విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. దీనిపై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 18, 2026

మహిళా రిజర్వేషన్: 2034 వరకు ఆగాల్సిందేనా?

image

2026 జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యాకే ‘నారీ శక్తి వందన్ అధినియం-2023’ చట్టం అమల్లోకి వస్తుందని అప్పట్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. తాజాగా 131వ సవరణ బిల్లు వీగిపోవడంతో 2029లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కష్టమని, 2034 వరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పటివరకు మహిళలు వేచి చూడాల్సిందేనేమో!

News April 18, 2026

మహిళలకు విపక్షాల ద్రోహం: CM

image

AP: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దారుణమని సీఎం చంద్రబాబు విమర్శించారు. విపక్షాలన్నీ కలిసి మహిళల సాధికారతను అడ్డుకున్నాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల వైఖరిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఇది రాజకీయ అడ్డంకి మాత్రమే కాదని, కోట్లాది మంది మహిళలకు చేసిన ద్రోహం కూడా అని మండిపడ్డారు.