News February 4, 2025

WNP: విద్యార్థిని సన్మానించిన వనపర్తి జిల్లా ఎస్పీ

image

చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన పసుల శంకర్ యాదవ్ కుమారుడు మనోహర్ బీఎ డిగ్రీ పూర్తి చేసి వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్‌డీఎం లా కాలేజీలో చదువుతూ మొదటి సంవత్సరం సెమిస్టర్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే మొదటి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మనోహర్‌ను వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్, కళాశాల అధ్యాపకులు, కొప్పునూరు గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

Similar News

News March 26, 2026

తూప్రాన్: తల్లి మరణం తట్టుకోలేక కొడుకు సూసైడ్

image

తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో సబ్బని సంతోష్(40) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. సంతోష్ తల్లి భాగ్యమ్మ 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి సంతోష్ తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. ఈ క్రమంలో భార్యను మేనమామ ఇంటికి పంపి తాను వస్తానని చెప్పి ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News March 26, 2026

వరల్డ్ నంబర్ వన్ లీడర్ మోదీ: 68% రేటింగ్‌తో మళ్లీ టాప్!

image

USకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్’ లేటెస్ట్ సర్వే ప్రకారం 68% అప్రూవల్ రేటింగ్‌తో మోదీ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్‌గా నిలిచారు. రెండో స్థానంలో స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ పార్మెలిన్, సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ (62%) ఉన్నారు. US అధ్యక్షుడు ట్రంప్ (39%), బ్రిటన్ PM కీర్ స్టార్మర్ (24%) మోదీ కంటే వెనుకబడ్డారు. అలాగే నెహ్రూ తర్వాత అత్యధిక కాలం PMగా ఉన్న వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు.

News March 26, 2026

కామారెడ్డి: వైద్యపోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

గాంధారి, మద్నూర్ CHCలలో ఖాళీగా ఉన్న 2 MBBS (GDMO) కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు విజయ్ భాస్కర్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 28 మ.12 వరకు DCHS కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. అర్హులైన వారికి మార్చి 28 సా.4 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థులు అసలు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు.