News February 4, 2025

చిన్నారికి శ్రీశైలం ఎమ్మెల్యే సాయం

image

సున్నిపెంటకు చెందిన ఓ చిన్నారి వైద్యశాలలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రిక్షా కాలనీకి చెందిన శివ 5ఏళ్ల కుమార్తెపై ఇనుప గేటు ప్రమాదవశాత్తు పడింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయమై ఒంగోలులో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న శ్రీశైల మండల టీడీపీ ఇన్‌ఛార్జి వై.యుగంధర్ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాలతో చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తమై ఆర్థిక సాయం అందజేసి మానవత్వం చాటారు.

Similar News

News September 15, 2025

MBNR: పొలం విరాసత్ చేయడం లేదని రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

image

ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన MBNR జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దేవరకద్ర(M) బస్వాయపల్లి వాసి శంకర్ పొలం విరాసత్ కోసం 5ఏళ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అయినా పని కాలేదు. ఈరోజు ఆటోలో భార్య, ఇద్దరు పిల్లలతో MBNR వచ్చి పెట్రోల్ పోసుకొని కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన స్థలానికి RDO నవీన్ చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

News September 15, 2025

పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించండి: KMR కలెక్టర్

image

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాల వల్ల నీరు నిలిచి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని జిల్లా పంచాయతీ అధికారి మురళీ, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.

News September 15, 2025

శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా పోలీసుల వాహన తనిఖీలు

image

శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలతో సోమవారం సాయంత్రం పోలీసులు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించగా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని అవగాహన కల్పిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.