News February 4, 2025
విజయవాడలో ప్రమాదం.. వ్యక్తి మృతి

విజయవాడలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. కృష్ణలంక పోలీసులు తెలిపిన సమాచారం మేరకు విజయవాడకు చెందిన కొప్పుల భరద్వాజ్ హోటల్ మేనేజ్మెంట్ సీట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో బెంజ్ సర్కిల్ వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 22, 2026
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.190, మాంసం 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.310 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 22, 2026
నాగాయలంక మత్స్యకార బిడ్డ.. అంతర్జాతీయ ఖ్యాతి!

కృష్ణా (D) నాగాయలంకకు చెందిన మత్స్యకార బిడ్డ నాగిడి గాయత్రి క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్’ను ఆమె పూర్తి చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ కోచ్‌ల చేతుల మీదుగా ఆమె సర్టిఫికెట్, అవార్డు అందుకున్నారు. గాయత్రి ప్రతిభను గుర్తించిన గ్రామస్థులు, కోచ్‌లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
News March 22, 2026
ప్రకాశం: ‘నేడు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు’

ప్రకాశం జిల్లాలో ఆదివారం కూడా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించడం వలన పెనాల్టీ పడదని అన్నారు. ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.


