News February 4, 2025
వసంత పంచమి వేళ ధర్మపురి నారసింహుడి ఆదాయం ఎంతంటే..?
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం వివిధ కార్యక్రమాల ద్వారా రూ.2,16,551 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,27,260, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.74,100, అన్నదానం రూ.15,191 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటనలో వివరించారు.
Similar News
News February 4, 2025
తిరుపతి డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి
AP: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. ఆయనకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది సభ్యులు ఓటు వేశారు. అటు నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా TDP అభ్యర్థి, పదో వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణ కుమారి ఎన్నికయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులను కాదని ఈమెకు పార్టీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది.
News February 4, 2025
నేడు వరల్డ్ క్యాన్సర్ డే!
కాన్సర్‌పై అవగాహన, దాని నివారణ, గుర్తింపు, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతియేటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిని ముందుగా గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. భారతదేశంలో ఏటా సగటున 11 లక్షల మందికి ఇది సోకుతుండగా 2023లో 14.96లక్షల మందికి పైగా చనిపోయారు. రొమ్ము, గర్భాశయ, లంగ్, బ్లడ్, నోటి క్యాన్సర్ వంటివి ఎక్కువగా సోకుతున్నాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
News February 4, 2025
అవసరమైతే జైలుకైనా పోతా: ఎమ్మెల్యే దానం
TG: పేదల ఇళ్లు కూల్చుతా అంటే ఊరుకోబోమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. కూల్చివేతల విషయమై తనకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. తన ఇంట్లో అభిమానించే వైఎస్సార్, కేసీఆర్ ఫొటోలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.