News February 4, 2025

అనకాపల్లి: గణనీయంగా తగ్గిన టమాటా ధరలు

image

గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో సోమవారం జరిగిన వారపు సంతలో టమాటా ధర కిలో రూ.5కు పడిపోయింది. 30 కిలోల క్రేట్ టమాటాల ధర రూ.140 నుంచి రూ.150 పలికింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు టమాటాలను తీసుకురావడంతో ధరలు గణనీయంగా తగ్గిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఇదే విధంగా ధరలు కొనసాగితే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News March 11, 2026

ఆదర్శ గ్రామాల్లో తెలంగాణదే హవా: ఎంపీ రవిచంద్ర

image

దేశంలోని టాప్-20 ఆదర్శ గ్రామాల్లో 19 తెలంగాణవేనని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. రాజ్యసభలో ‘హర్‌ ఘర్‌ జల్‌’ చర్చలో ఆయన మాట్లాడుతూ.. గత కేసీఆర్‌ ప్రభుత్వం రూ.43 వేల కోట్లతో మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా నీరు అందించిందని తెలిపారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించి పల్లెలను అద్దంలా తీర్చిదిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

News March 11, 2026

GNT: అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్

image

అంబేడ్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులతో వరుస వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి టీచర్, సొంత పేరెంట్ లా మంత్రి విద్యార్థులకు ధైర్యం చెప్పి పలు సూచనలు చేశారు. మంగళవారం తాడేపల్లి AP SWREIS కార్యాలయంలో అంబేడ్కర్ గురుకులాల 10 వ తరగతి విద్యార్థులతో మంత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News March 11, 2026

కొమరాడలో YS.షర్మిల పరిరక్షణ యాత్ర

image

కొమరాడ మండలం కుమ్మరిగుంట పంచాయతీ డంగభద్ర గ్రామంలో ఈనెల 17న ఏపీ పీసీసీ చీఫ్ YS.షర్మిలా రెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర (రచ్చబండ) కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీసీసీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి డంగభద్ర గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు.