News February 4, 2025
తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్‌కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Similar News
News November 15, 2025
పేలుడు పదార్థాల్లో రసాయనిక చర్యతోనే భారీ బ్లాస్టింగ్!

J&K నౌగామ్ పోలీసు స్టేషన్లో భారీ బ్లాస్టింగ్ ఉగ్రదాడి కాదని అధికారులు స్పష్టం చేశారు. ఫరీదాబాద్(హరియాణా)లో వైట్‌కాలర్ టెర్రరిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న360 KGల కెమికల్ పేలుడు పదార్థాల్లో అత్యధిక భాగం ఈ PSలోనే ఉంచారు. శుక్రవారం రాత్రి వీటి నుంచి శాంపిల్స్ తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు PTI పేర్కొంది. ఘటనలో 9 మంది మృతి చెందగా 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. PS తునాతునకలైంది.
News November 15, 2025
KMR: అంతర్రాష్ట్ర ముఠా నిందితుడిపై PD యాక్ట్ అమలు

చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాపై KMR పోలీస్ ఉక్కుపాదం మోపింది. ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు భాస్కర్ భాపురావ్ చవాన్‌పై కలెక్టర్ ఆదేశాల మేరకు PD యాక్ట్ అమలు చేశారు. అతనిపై KMR, NZB, NRML జిల్లాల్లో 14 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. ముఠాలోని మరో ముగ్గురిపై PD యాక్ట్ అమలు చేశారు. ప్రజల్లో భయం సృష్టిస్తున్న వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని SP రాజేష్ చంద్ర హెచ్చరించారు.
News November 15, 2025
చర్మంపై నల్ల మచ్చలొస్తున్నాయా?

చర్మంపై నల్లమచ్చలుంటే వాటిని సన్ స్పాట్స్ (ఫ్రెకెల్స్) అని అంటారు. ఎండలోకి వెళ్లినప్పుడు సూర్యకాంతి తగలడం వల్ల రియాక్షన్ టెండెన్సీకి బ్రౌన్ రంగు మచ్చలు వస్తాయి. ఇలాంటప్పుడు ప్రతి 2-3గంటలకోసారి SPF 30/ 50 ఉన్న క్రీముని రాసుకుంటే సమస్యను కొంతవరకూ నియంత్రించవచ్చు. అలానే కోజిక్‌యాసిడ్, ఎజిలిక్ యాసిడ్, ఆర్‌బ్యూటిన్ వంటివి రాత్రి రాసుకుంటే పగటికాంతికి దెబ్బతిన్న చర్మం రాత్రికి రిపేర్ అవుతుంది.


