News February 4, 2025

తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

image

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్‌కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Similar News

News February 4, 2025

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారంతో పోలీస్తే ఈరోజు వివిధ రకాల మిర్చి ధరలు తగ్గాయి. సోమవారం క్వింటా తేజ మిర్చి ధర రూ. 13,900 పలకగా నేడు రూ.13,500 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,500 పలకగా ఈరోజు రూ.14,200కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15వేలకు చేరింది.

News February 4, 2025

MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

News February 4, 2025

NZB: జిల్లా బృందానికి సిల్వర్ మెడల్

image

జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో భాగంగా 4*100 మీటర్ల రిలేలో నిజామాబాద్ జిల్లా అథ్లెట్లు సిల్వర్ మెడల్ సాధించారు. కేరళ రాష్ట్రంలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో భాగంగా జిల్లాకు చెందిన గోపి, దినేష్, ఉత్తమ్‌తో పాటు ఇది వరకు నిజామాబాద్‌లో ఎస్‌హెచ్‌ఓగా పని చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఇందులో పాల్గొన్నారు. అద్భుత ప్రతిభను ప్రదర్శించి సిల్వర్ మెడల్ సాధించారు.

error: Content is protected !!