News February 4, 2025
వసంత పంచమి వేళ ధర్మపురి నారసింహుడి ఆదాయం ఎంతంటే..?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం వివిధ కార్యక్రమాల ద్వారా రూ.2,16,551 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,27,260, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.74,100, అన్నదానం రూ.15,191 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటనలో వివరించారు.
Similar News
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. కరీంనగర్‌కు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని, వేసవిలో సాగు, తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
News March 12, 2025
కరీంనగర్: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

కరీంనగర్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన కరుణాకర్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. హుస్నాబాద్ మండడం మహ్మాదాపూర్‌కి చెందిన నర్సింహాచాలి ఆనారోగ్యంతో ఉరేసుకున్నాడు. మానకొండూర్ మండలం పోచంపల్లికి చెందిన అంజయ్య మానసిక స్థితి సరిగా లేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 12, 2025
సైదాపూర్: గ్రూప్-2 RESULT.. యువకుడికి 70వ ర్యాంక్

సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్‌కి చెందిన సంతపురి నిఖిల్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రంలో 70వ ర్యాంకు సాధించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిఖిల్ రెడ్డి గతంలో గ్రూప్-4లో 7వ ర్యాంకు సాధించి ప్రస్తుతం కరీంనగర్ డీటీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.