News February 4, 2025
తాడేపల్లి: నందిగం సురేశ్‌కు ధైర్యం చెప్పిన జగన్

విదేశీ పర్యటన ముగించుకొని మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ నందింగం సురేశ్‌ను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. భయపడవద్దు అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి, పేర్నినాని, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 17, 2026
GNT: స్వర్ణాంధ్ర@2047 క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం I&PR రూపొందించిన “స్వర్ణాంధ్ర@2047” క్యాలెండర్లను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం ఆవిష్కరించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం పేదరిక నిర్మూలన, ఉపాధి ఉద్యోగ కల్పన, నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి, వ్యవసాయంలో సాంకేతికత, ప్రపంచ స్థాయి రవాణా, స్వచ్ఛ ఆంధ్ర 10 సూత్రాలతో విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు.
News March 17, 2026
ప్రమాదాలు తగ్గాయి.. ఇదే చొరవ కొనసాగించాలి: కలెక్టర్

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది తగ్గాయని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. రహదారి భద్రత కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. 2024లో 1,046 ప్రమాదాలు జరిగాయని, 2025 లో 910 జరిగాయని తెలిపారు. మరణాలు కూడా 19 శాతం తగ్గాయని చెప్పారు.
News March 17, 2026
మంగళగిరి: దివ్యాంగులకు రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం!

రాష్ట్రంలోని 40 శాతం వికలాంగత్వం ఉన్న దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకాన్ని ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు మంగళగిరి బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తొలుత గుంటూరులో అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వేదికను మంగళగిరికి మార్చారు. ఈ మేరకు ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పర్యవేక్షించారు.


