News February 4, 2025
గిరిజన నిరుద్యోగ యువకులకు దరఖాస్తుల ఆహ్వానం

భద్రాద్రి జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ గ్రూప్-డి (32,000) పోస్టులకు ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఉప సంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ తెలిపారు. గిరిజన నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
Similar News
News April 19, 2026
గిరిజన గురుకుల ప్రవేశ పరీక్షలు ప్రశాంతం

ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆదివారం గిరిజన గురుకుల CoE ప్రవేశ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఐదు కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 88.59 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్సీఓ అరుణకుమారి తెలిపారు. మొత్తం 1,692 మందికి గాను 1,468 మంది హాజరయ్యారని, పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. భద్రాచలంలోని పలు కేంద్రాలను ఆమె స్వయంగా తనిఖీ చేశారు.
News April 19, 2026
ఛేజింగ్‌లో చేతులెత్తేస్తున్న ఛాంపియన్లు

ఐదుసార్లు IPL ఛాంపియన్లు అయిన MI, CSK ఛేజింగ్‌లో చేతులెత్తేస్తున్నాయి. 2024 నుంచి ఇప్పటివరకు ముంబై 19 మ్యాచుల్లో 12 ఓడిపోగా, చెన్నై 16 మ్యాచుల్లో 10 ఓడిపోయి ఛేజింగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన జట్లుగా నిలిచాయి. ఈ ఇరు జట్లు ఛేజింగ్‌ను మెరుగుపర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక CSK కెప్టెన్ రుతురాజ్ ఛేజింగ్ రికార్డ్ కూడా వీక్‌గా ఉంది. 2022 నుంచి 23 మ్యాచ్‌ల్లో రుతురాజ్ కేవలం 518 రన్స్ చేశారు.
News April 19, 2026
తూ.గో: రేపు యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్

తూ.గో జిల్లా వ్యాప్తంగా సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లు యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించే జిల్లా స్థాయి కార్యక్రమంలో RDOలు, MROలు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారన్నారు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


