News February 4, 2025
ప్రకాశం: రెండు రోజుల్లో ఇద్దరు మృతి

గత రెండు రోజులుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం పామూరు మండలం గోపాలపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లూరి జిల్లాకు చెందిన అశోక్ (21) అనే యువకుడు మృతి చెందాడు. జరుగుమల్లి మండలం పచ్చవకు చెందిన మాలకొండయ్య (60) పొలం చూసుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా మరో బైక్ ఢీకొనడంతో ఆయన మృతి చెందారు.
Similar News
News April 10, 2026
నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌పై జాగ్రత్త: SP

ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా మోసాలు పెరుగుతున్నట్లు హెచ్చరించారు. Facebook, Instagram, Twitterలో తెలిసిన వారి పేర్లతో ఫేక్ అకౌంట్లు సృష్టించి డబ్బులు అడుగుతున్నారని అన్నారు. అలాంటి సందేశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సూచించారు. మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలని, లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
News April 10, 2026
ప్రకాశం: ఐరన్ ఓర్ నిక్షేపాల గుర్తింపు

కందుకూరు నియోజకవర్గం VVపాలెం, లింగసముద్రం మండలాల్లో ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణైంది. నాణ్యమైన మాగ్నటైట్ ఐరన్ ఓర్ ఉన్నట్లు గుర్తించారు. JSW గ్రూప్‌నకు కాంపోజిట్ లైసెన్స్ లభించగా తవ్వకాలకు సిద్ధమవుతోంది. భూముల సేకరణను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2187 చ.కి.మీ విస్తీర్ణంలో నిక్షేపాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక్కడ ప్రభుత్వ, అటవీ, ప్రైవేట్ భూములు ఉన్నాయి.
News April 10, 2026
మార్కాపురంలో ఏప్రిల్ 11న పూలే జయంతి: కలెక్టర్

మహాత్మా జ్యోతి బాపూలే జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 11వ తేదీన మార్కాపురంలోని తర్లుపాడు రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వద్ద పూలే జయంతి వేడుకలు జరపనున్నట్లు తెలిపారు. అదే విధంగా కలెక్టరేట్‌లో కూడా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


