News February 4, 2025

HYDలో ట్రాఫిక్ రద్దీ.. ముందుకు కదలని బండి..!

image

మహానగరంలో రద్దీ వేళల్లో 10 కిలోమీటర్లు ప్రయాణించాలంటే దాదాపు 32 నిమిషాల సమయం పడుతుందని ఇంటర్నేషనల్ సంస్థ టామ్ టామ్ వెల్లడించింది. SMTI ట్రాఫిక్ సర్వే నిర్వహించి ఈ విషయాలను వివరించింది. HYD‌కు జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు వచ్చినట్లు తెలిపింది. దేశ, విదేశాల్లోనూ ఈ సర్వే చేపట్టింది. సర్వే రిపోర్టును బట్టి HYDలో రద్దీ సమయాల్లో బండి గంటకు 19KM వేగానికి మించట్లేదు.

Similar News

News March 20, 2026

SRH జట్టుకు మరో షాక్!

image

IPL: మొదటి కొన్ని మ్యాచ్‌లకు ఇప్పటికే కెప్టెన్ కమిన్స్ దూరం కాగా SRH జట్టుకు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా లీగ్ నుంచి వైదొలిగినట్లు Cricbuzz తెలిపింది. అయితే గాయానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఇటీవల వేలంలో AUSకు చెందిన ఈ ప్లేయర్‌ను SRH రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇద్దరు పేసర్లు లేకపోవడం SRH బౌలింగ్‌ విభాగానికి తలనొప్పిగా మారింది.

News March 20, 2026

పలమనేరు మాజీ MLA మృతి

image

పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న (TC) రాజన్ (108) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బెంగళూరులోని ఓప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు‌. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. నిస్వార్థ స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. ఆస్తులు, సొంత ఇల్లు లేకుండా నిరాడంబరంగా జీవించారు. ప్రభుత్వ పింఛన్‌తోనే జీవనం సాగించారు.

News March 20, 2026

కాకినాడ: పులి అదే రూట్‌లో వెళ్లింది..!

image

కాకినాడ జిల్లా నుంచి పెద్దపులి తిరిగి పోలవరం జిల్లాకు వెళ్లిపోయింది. రాజఒమ్మంగి మండలం వద్ద పులి సంచారాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలు మండలాలకు ఏ దారిలో వచ్చిందో, తిరిగి అదే దారిలో పోలవరం వైపు వెళ్లిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పులి భయం తొలగిపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఊరట చెందుతున్నారు. పులి మళ్లీ రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నారు.