News February 4, 2025

అల్లూరి: ట్యాంకర్ బోల్తా పడి వ్యక్తి మృతి

image

జాతీయ రహదారి పనుల్లో భాగంగా వాటరింగ్ చేస్తున్న ట్యాంకర్ బోల్తా కొట్టడంతో క్లీనర్ నాగరాజు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. కొయ్యూరు మండలంలోని మట్టపనుకుల వద్ద సోమవారం రాత్రి జరిగింది. నాగరాజు ట్యాంకర్ క్రింద ఉండిపోవడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మృతుని స్వగ్రామమైన ఎం.మాకవరంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిశోర్ వర్మ తెలిపారు.

Similar News

News April 2, 2026

జనగామ: తండ్రి చనిపోయిన దుఃఖంలోనే ‘పది’ పరీక్షకు

image

తండ్రి చనిపోయిన దుఃఖంలోనే పది పరీక్ష రాసిన సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. స్టే.ఘ. మండలం తాటికొండకి చెందిన దేవరాయ సాంబయ్య (47) 10ఏళ్లుగా కుటుంబంతో కలిసి స్టే.ఘ.లో ఉంటున్నాడు. అనారోగ్యానికి గురైన సాంబయ్య గురువారం రాత్రి మృతి చెందగా, మృతదేహాన్ని తాటికొండకు తరలించారు. పదో తరగతి చదువుతున్న అతని కుమారుడు చరణ్.. తండ్రి మృతి చెందిన దుఃఖంలోనే పరీక్ష రాశాడు. పరీక్ష అయ్యాక అంత్యక్రియలు పూర్తి చేశాడు.

News April 2, 2026

భీమవరంలో సంబరాలు

image

అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించడంతో జిల్లావ్యాప్తంగా గురువారం పండుగ వాతావరణం నెలకొంది. భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. తొలుత అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజధాని ఖరారు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.