News March 19, 2024

123 అడుగుల దోశ వేసి రికార్డు సృష్టించారు

image

బెంగళూరులోని కొందరు చెఫ్‌లు వినూత్నంగా ఆలోచించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునేందుకు ఏకంగా 123 అడుగుల పొడవైన దోశను తయారు చేశారు. మొత్తం 75 మంది చెఫ్‌లు కలిసి ఈ భారీ దోశను వేశారు. దాదాపు 110 విఫల ప్రయత్నాల తర్వాత ఈ రికార్డు నమోదైంది. అంతకుముందు, గిన్నిస్ రికార్డ్స్‌లో 16.68 మీటర్లు (54 అడుగుల 8.69 అంగుళాలు) దోశ ఉండేది.

Similar News

News November 15, 2024

ఒంగోలు వైసీపీ ఇన్‌ఛార్జిగా రవిబాబు

image

AP: ఒంగోలు నియోజకవర్గ YCP ఇన్‌ఛార్జిగా చుండూరి రవిబాబును ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం), బొడ్డేడ ప్రసాద్ (అనకాపల్లి)లను నియమించింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించింది. ఆముదాలవలస YCP సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.

News November 15, 2024

శాంసన్, తిలక్ ఊచకోత.. భారత్ భారీ స్కోర్

image

చివరి టీ20లో సౌతాఫ్రికా బౌలర్లను భారత బ్యాటర్లు ఊచకోత కోశారు. శాంసన్(109*), తిలక్ వర్మ(120*) సెంచరీల మోత మోగించారు. జోహెన్నెస్‌‌బర్గ్‌లో బౌండరీల వర్షం కురిపించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 283/1 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ, తిలక్ విధ్వంసానికి సఫారీ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. మ్యాచ్‌లో మొత్తం 23 సిక్సర్లు బాదడం విశేషం. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 36 రన్స్‌తో రాణించారు.

News November 15, 2024

తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ

image

తిలక్ వర్మ వరుసగా టీ20ల్లో రెండో సెంచరీ బాదారు. సౌతాఫ్రికాతో 4వ టీ20లో విధ్వంసం సృష్టించిన అతడు కేవలం 41 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. 9 సిక్సర్లు, 6 ఫోర్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే అతడిచ్చిన 3-4 క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేయడం తి‘లక్’కు కలిసొచ్చింది. కాగా 3వ టీ20లోనూ తిలక్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సంజూ కూడా సెంచరీతో మెరవడంతో భారత్ 300 స్కోర్ దిశగా సాగుతోంది.