News February 4, 2025
స్టేషన్ ఘనపూర్: మంటల్లో కాలిన రూ.25 లక్షల నగదు!

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మల్లయ్య, కృష్ణమూర్తికి చెందిన రూ.25 లక్షల నగదుతో పాటు అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు, ఐలయ్యకు చెందిన రూ.5 లక్షల విలువైన టెంటు సామగ్రి మంటల్లో కాలి బూడిద అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News September 18, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయులను భర్తీ చేయాలని వినతి

జిల్లాలో ఉపాధ్యాయ ప్రమోషన్‌తో మిగిలిపోయిన పోస్టులను తదుపరి సీనియార్టీ జాబితాతో భర్తీ చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డీఈవో వెంకటేశ్వర్లకు గురువారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు దుర్గయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
News September 18, 2025
మంచిర్యాల: ‘మేదరి కులస్థులకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి’

మంచిర్యాల పట్టణంలో గురువారం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెదురుతో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. అనంతరం మేదరి మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు సూరినేని కిషన్ మాట్లాడుతూ.. కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మేదరులకు రాష్ట్ర ప్రభుత్వం వెదురు బొంగులు ఉచితంగా సరఫరా చేయాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కోరారు.
News September 18, 2025
ఆందోల్: మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి: మంత్రి

నిలోఫర్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి దామోదర్ రాజానర్సింహా పేర్కొన్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పటిష్ఠ పర్చాలని మంత్రి దిశానిర్దేశం చేసారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ, ఎండీ తదితరులు పాల్గొన్నారు.