News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి షాక్.. బరిలో మరో అభ్యర్థి

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల MLC అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించగ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
Similar News
News March 10, 2026
గుంటూరు: మరి కాసేపట్లో ముగియనున్న గడువు

గుంటూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణకు మరికొన్ని గంటలే మిగిలాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అర్హులైన తల్లిదండ్రులు మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల్లోపు ఉండాలి. ఎంపిక కోసం లాటరీ విధానం అమలు చేస్తారు. ఎంపికైన వారు మార్చి 26 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాలను నిర్ధారించాలి.
News March 10, 2026
సిద్ధిపేట: ‘ఆరోగ్య ఖాకీ’కి సీపీ శ్రీకారం

పోలీస్ అధికారుల సంక్షేమం కోసం సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ మంగళవారం ‘ఆరోగ్య ఖాకీ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శారీరకంతో పాటు మానసిక దృఢత్వం అవసరమని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 200 మంది సిబ్బందికి వివిధ రకాల పరీక్షలు చేశారు. విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించి ఫిట్‌గా ఉండాలని కోరారు.
News March 10, 2026
12pm-4pm పనులు రీషెడ్యూల్ చేసుకోండి: అనిత

AP: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. 12pm-4pm మధ్య బహిరంగ ప్రదేశాల్లో పనులుంటే రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. APSDMA, RTGS నుంచి ఎప్పటికప్పుడు వడగాల్పుల హెచ్చరికలు చేరవేయాలని ఆ విభాగాల అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు. వడదెబ్బ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.


