News February 4, 2025
పతకాలు సాధించిన సిబ్బందికి ఎస్పీ అభినందనలు

తెలంగాణ స్పోర్ట్స్ మీట్-2025లో పోలీస్ సిబ్బంది 14 పతకాలు సాధించినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. కరీంనగర్‌లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు 3వ తెలంగాణ స్పోర్ట్స్ మీట్ జరిగాయని అన్నారు. సోమవారం తన కార్యాలయంలో సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తిని కనబరుస్తూ రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చాటాలన్నారు.
Similar News
News January 13, 2026
‘భూభారతి’లో బకాసురులు!

TG: భూభారతి పోర్టల్ ద్వారా జరిగిన <<18815490>>అక్రమాల<<>> తీగ లాగితే డొంక కదులుతోంది. భూముల రిజిస్ట్రేషన్ల సందర్భంగా మీసేవ, ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్ల నిర్వాహకులు స్టాంప్ డ్యూటీ, ఛార్జీలను నొక్కేసినట్లు గుర్తించారు. యాదగిరిగుట్టకు చెందిన ప్రధాన సూత్రధారి బస్వరాజుతో పాటు పాండు, గణేశ్ సహా 14మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. రూ.50Cr స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది.
News January 13, 2026
బాధితులకు రూ.25వేల సాయం ప్రకటన

AP: కాకినాడ(D) సార్లంకపల్లె <<18842252>>అగ్నిప్రమాదం<<>>పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాలకు తక్షణసాయంగా రూ.25వేలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ప్రస్తుతం వసతి, ఇతర సహాయాలు అందించాలని సూచించారు. కాగా నిన్న సార్లంకపల్లెలో 40 తాటాకు ఇళ్లు అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన విషయం తెలిసిందే.
News January 13, 2026
విశాఖ: స్వపక్షంలోనే విపక్షమా..!

కూటమిలో కీలకంగా ఉన్నా.. తనదైన వ్యాఖ్యలతో తరచూ చర్చకు కేంద్రంగా నిలుస్తున్నారు MLA విష్ణుకుమార్ రాజు. డేటా సెంటర్ల ఉద్యోగాల అంశం, రుషికొండ భవనాల, భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో ప్రభుత్వానికి అసౌకర్యం కలిగేలా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. కూటమిలో తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావన.. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఆయనకు సంబంధించిన బకాయిలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో అసహనానికి గురవుతున్నారనే వాదన ఉంది.


