News February 4, 2025
వర్గల్ విద్యాధరి క్షేత్రంలో ఉత్సవాలు విజయవంతం

ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు 50 వేలకు పైగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పదివేలకు పైగా భక్తులు పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 23, 2026
హౌరా ఎక్స్‌ప్రెస్ కింద పడి స్నేహితుల సూసైడ్

తడ మండలం కొండూరు సమీపంలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతులను పిండిపాలెంకు చెందిన దమ్మకళ్యాణ్ (23), పేర్నాడుకు చెందిన జెడ్డా సునీల్ (25)గా గుర్తించారు. వీరు హౌరా ఎక్స్‌ప్రెస్ కింద పడినట్లు తెలుస్తోంది. లోకో పైలట్ సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
News March 23, 2026
రాజధాని డిజైన్లకే రూ.401 కోట్లా: YCP

AP: అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాల డిజైన్ల పేరిట CBN, ఆయన బినామీలు రూ.కోట్లు కొట్టేస్తున్నారని YCP ఆరోపించింది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి డిజైన్లు గీసి ఇవ్వడానికే దాదాపు రూ.401 CR ఖర్చు పెడుతున్నారని పేర్కొంది. 2016లో ఓ జపాన్ సంస్థకు, 2017లో జెనిసిస్ ప్లానర్స్‌కు రూ.113CRకు కాంట్రాక్టు ఇచ్చి రద్దు చేశారని తెలిపింది. 2024లో మళ్లీ జెనిసిస్‌కు రూ.137CRకు కాంట్రాక్టు ఇచ్చారని విమర్శించింది.
News March 23, 2026
జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు వేగవంతం: కలెక్టర్

అనంతపురం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. శిల్పారామంలో మౌలిక వసతులు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. గుత్తి, కుందుర్పి కోటల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. అనంతసాగరం చెరువులో బోటింగ్ ప్రారంభించాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మరుగుదొడ్లు, సమాచారం బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


