News February 4, 2025

సూర్యాపేట: చికెన్ ముక్క కోసం పంచాయితీ

image

చికెన్ ముక్క రెండు గ్రామాల మధ్య వివాదానికి తెరలేపింది. స్థానికుల వివరాలు.. మేళ్లచెరువులోని ఓ చికెన్ దుకాణంలో మరో గ్రామానికి చెందిన వ్యక్తి చికెన్ కొనుగోలు చేశాడు. చికెన్ ముక్క కోరిన విధంగా ఇవ్వలేదని ప్రశ్నించగా షాపు నిర్వాహకుడు దాడి చేశాడు. షాపు నిర్వాహకుడిపై బాధితుడి తరఫు బంధువులు దాడి చేశారు. దీంతో 2 గ్రామాల మధ్య పంచాయితీ మొదలై పెద్ద మనుషుల జోక్యంతో చికెన్ షాప్ యజమానికి జరిమానా విధించారు.

Similar News

News July 6, 2025

పటాన్‌చెరు: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్య, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులు వంటి విషయాలపై ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

News July 6, 2025

శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీకి చెందిన పడాల. నారాయణ రావు(84) శనివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. డాక్టర్ కె.సుదీర్ పర్యవేక్షణలో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, చిన్ని కృష్ణ ద్వారా అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

News July 6, 2025

HYD: మొహరం స్పెషల్.. బీబీ కా అలమ్‌ గురించి తెలుసా..!

image

బీబీ కా ఆలం హైదరాబాద్‌లోని ప్రముఖ శియా ముస్లిం పవిత్ర ధ్వజం(అలమ్)గా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రతి సంవత్సరం మొహరం నెలలో, ముఖ్యంగా ఆశురా రోజున వైభవంగా జరిగే ఊరేగింపులో ప్రజల దర్శనార్థం ఉంచుతారు. ఈ అలమ్‌ను ఖాసా అలంకరించిన ఏనుగుపై ఊరేగించడం అనేది కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ పరిపాలన కాలం నాటి సంప్రదాయం. దీన్ని బీబీ ఫాతిమా(ప్రవక్త మహమ్మద్ కుమార్తె) స్మృతిగా భావిస్తారు.