News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి షాక్.. బరిలో మరో అభ్యర్థి

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. ADB కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించగ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
Similar News
News November 7, 2025
జగిత్యాల: ‘ఉద్యోగ భద్రత కల్పించాలి’

మండల కంప్యూటర్ సెంటర్ (MCC) అటెండర్లు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ జగిత్యాల DRDO అధికారి రఘువరన్‌కు వినతిపత్రాన్ని శుక్రవారం సమర్పించారు. 2010 నుంచి విధులు నిర్వహిస్తున్నప్పటికీ నెలకు రూ.5200 మాత్రమే అందుతున్నదని, SHG సమాఖ్యల ద్వారా కాకుండా వ్యక్తిగత ఖాతాల్లో జీతాలు జమచేయాలని కోరారు. జిల్లా అటెండర్ల అధ్యక్షులు నాగరాజు, రాకేష్, అంజిత్ తదితరులు పాల్గొన్నారు.
News November 7, 2025
బ్రిటిష్ పాలన చట్టాలతో ఆస్తి కొనుగోళ్లలో కష్టాలు: SC

దేశంలో ప్రాపర్టీ కొనుగోళ్లు బాధలతో కూడుకున్నవిగా మారాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘1882 నాటి చట్టాలతోనే ఇప్పటి ‘రియల్’ వ్యవహారాలు నడుస్తున్నాయి. నాటి యాక్ట్ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తుంది తప్ప టైటిల్ కాదు. రిజిస్టర్డ్ సేల్‌డీడ్ లావాదేవీ విలువ రికార్డు మాత్రమే. అది యాజమాన్య హక్కు ఇవ్వదు’ అని పేర్కొంది. చట్టాలను సవరించి నేటి టెక్నాలజీతో రిజిస్ట్రేషన్లను ఆధునికీకరించాలని సూచించింది.
News November 7, 2025
HDFC బ్యాంక్ యూజర్లకు BIG ALERT

ఈ రాత్రి 2.30 గంటల(8వ తేదీ) నుంచి ఉ.6.30 గంటల వరకు తమ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవని HDFC ప్రకటించింది. మెయింటెనెన్స్‌లో భాగంగా UPI, నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. ఈమేరకు ఖాతాదారులకు మెసేజ్‌లు పంపుతోంది. ఆ సమయంలో ట్రాన్సాక్షన్స్ కోసం PayZapp వ్యాలెట్ వాడాలని సూచించింది. మరి మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?


