News February 4, 2025
VZM: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
కరెంట్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన పాచిపెంట మండలం కర్రివలసలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామభద్రపురం మండలం గొళ్ళలపేట గ్రామానికి చెందిన కె.రామారావు కర్రివలసలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ లైన్లు తగిలి మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News February 4, 2025
గుండుతోనే పెళ్లి చేసుకున్న మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్
ఆడవారు అందంగా కనిపించేందుకు తమ జుట్టుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా వేడుకల్లో ప్రత్యేక అలంకరణలో కనిపించేందుకు ఇష్టపడుతారు. అయితే డిజిటల్ క్రియేటర్ నీహర్ సచ్‌దేవా గుండుతోనే పెళ్లి చేసుకున్నారు. చిన్నతనం నుంచే అలోపీసీయా వ్యాధితో బాధపడుతున్న ఆమె ఎలాంటి విగ్గులేకుండా పెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇవి కాస్త వైరల్ అవ్వడంతో బ్యూటీ అనేది ఎలా ఉన్నా ప్రతిబింబిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
News February 4, 2025
సెన్సెక్స్ 1100 జంప్: రూ.6లక్షల కోట్ల లాభం
స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,666 (+320), సెన్సెక్స్ 78,250 (+1110) వద్ద ట్రేడవుతున్నాయి. కొన్ని దేశాలపై టారిఫ్స్‌ను ట్రంప్ వాయిదా వేయడం, డాలర్ ఇండెక్స్ తగ్గడం, ఆసియా స్టాక్స్ పుంజుకోవడం, బ్యాంకు, ఫైనాన్స్, O&G షేర్లలో ర్యాలీయే ఇందుకు కారణాలు. దీంతో ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.6లక్షల కోట్ల సంపదను పోగేశారు. శ్రీరామ్ ఫైనాన్స్, LT, ADANI SEZ, BEL, TATAMO టాప్ గెయినర్స్.
News February 4, 2025
కులగణనతో చరిత్ర సృష్టించాం: సీఎం రేవంత్
TG: కులగణన, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ నుంచే రోడ్ మ్యాప్ ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని ప్రకటించారు. కులగణన నివేదికను క్యాబినెట్‌లో ఆమోదించిన ఈరోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామని తెలిపారు. కులగణన విషయంలో తమ నిర్ణయంతో ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు.