News February 4, 2025

నేడు పీఎం మోదీ ఏం మాట్లాడుతారు?

image

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సా.5 గంటలకు లోక్‌సభలో ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు బడ్జెట్‌పై మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఢిల్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. ఉద్యోగులకు రూ.12లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అంశాన్ని కూడా పీఎం ప్రస్తావించే ఛాన్సుంది.

Similar News

News February 4, 2025

దూరమై ఒక్కటైన వేళ.. ఉద్వేగ క్షణాలు!

image

మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివెళ్లగా రద్దీ కారణంగా చాలా మంది తప్పిపోతున్నారు. అలాంటి వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఫాఫా మౌ జంక్షన్ రైల్వే స్టేసన్‌లో ఓ మహిళ తప్పిపోగా.. ఆమెను తన భర్తతో కలిపేందుకు రైల్వే పోలీసులు అవిశ్రాంతంగా శ్రమించి, అనౌన్స్‌మెంట్స్ ఇచ్చి ఎట్టకేలకు ఒక్కటి చేశారు. ఆ సమయంలో వారు ఉద్వేగానికి లోనై అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఫొటో వైరలవుతోంది.

News February 4, 2025

అమెరికా x చైనా: యుద్ధం మొదలైంది!

image

రెండు అతిపెద్ద ఎకానమీస్ మధ్య ట్రేడ్ వార్ మళ్లీ మొదలైంది. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్స్ దాడి ఆరంభించింది. అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గు, LNG ఉత్పత్తులపై 15%, క్రూడాయిల్, వ్యవసాయ యంత్రాలు, పెద్ద కార్లు, పికప్ ట్రక్స్‌పై 10% సుంకాలు ప్రకటించింది. Feb 10 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. చైనా ఉత్పత్తులపై ట్రంప్ వేసిన 10% టారిఫ్స్ శనివారం నుంచి అమల్లోకి రావడంతో ప్రతీకారానికి దిగింది.

News February 4, 2025

ప్రతి ఒక్కరూ ఇవి తెలుసుకోండి!

image

ఆరోగ్యకరమైన వ్యక్తి BP-120/80 ఉంటుంది. పల్స్ (70-100), టెంపరేచర్ (36.4°C-37.2°C), బ్రీతింగ్ (12-16p/m), హిమోగ్లోబిన్ (పురుషులు 13-18, మహిళలు 11.50-16g/dL), కొలస్ట్రాల్(130-200), పొటాషియం(3.50-5), సోడియం(135-145mEq/L), రక్తం (5-6L), షుగర్ (పిల్లల్లో 70-130, పెద్దల్లో 70-115mg/dL), ఐరన్ (8-15mg), తెల్ల రక్త కణాలు(4000-11000), ప్లేట్లెట్స్ (1.5L- 4L), విటమిన్ D3(20-50ng/ml), Vit-B12 (200-900pg/ml).

error: Content is protected !!