News February 4, 2025

HYD: అడ్డొచ్చిన పంది.. MLA గన్‌మెన్ మృతి (UPDATE)

image

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల MLA గన్‌మెన్ శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలు.. మృతుడు శంకర్‌పల్లి మం. బుల్కాపూర్ వాసి. వికారాబాద్ జిల్లా AR కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లిన అతడు రిటర్న్ అయ్యాడు. బైక్‌కు <<15346555>>అడవి పంది అడ్డురావడంతో<<>> తప్పించే క్రమంలో కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో శ్రీనివాస్ మృతి చెందాడు. సోమవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Similar News

News December 29, 2025

చిత్తూరు SPని కలిసిన ట్రైనీ SP

image

చిత్తూరు SP తుషార్ డూడీని సోమవారం ట్రైనీ ఎస్పీ డా.తరుణ్ పహ్వ మర్యాదపూర్వకంగా కలిశారు. 2024 బ్యాచ్‌కు చెందిన ఆయన AP క్యాడర్‌కు ఎంపికయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత 6 నెలల ప్రొబేషనరీ ట్రైనింగ్ నిమిత్తం చిత్తూరుకు చేరుకున్నారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం, సమస్యలను శ్రద్ధగా వినడం, వేగంగా పరిష్కరించడం ముఖ్యమని SP ఆయనకు సూచించారు.

News December 29, 2025

కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో యాసంగి పంటలకు సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లాలో అన్ని కౌంటర్లలో యూరియా విక్రయం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. యూరియా కొనుగోలు చేసే రైతు ఆధార్ కార్డ్, పట్టా పాస్ బుక్ జిరాక్స్ తీసుకుని సెంటర్‌కు వెళ్లాలన్నారు. అవసరమైన కౌంటర్ల వద్ద శామియానాలు, తాగు నీటి వసతి కల్పించాలని సూచించారు.

News December 29, 2025

విజయనగరం కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అర్జీదారులు పోటెత్తారు. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 232 వినతులు స్వీకరించారు. వచ్చిన వినతులను వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి వారం పీజీఆర్ఎస్‌పై సమీక్షిస్తామన్నారు.