News February 4, 2025
భూపాలపల్లి: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

2024- 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్‌ను ప్రవేశపెడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి జనవరి వరకు 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఫిబ్రవరి, మార్చిలో మిగతా 18.27 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ అందించనున్నారు.
Similar News
News March 5, 2026
ఇరాన్‌పై US పోరు వెనుక మతం రంగు?

ఇరాన్‌పై దాడులను సమర్థించుకునే క్రమంలో US తమ సైనికులకు మతసిద్ధాంతాలను చొప్పిస్తున్నట్లు రిపోర్ట్స్ రావడం కలకలం రేపుతోంది. దాదాపు 40 యూనిట్ల నుంచి 110 ఫిర్యాదులు వచ్చినట్లు మిలిటరీ రిలీజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వెల్లడించింది. బైబిల్‌లో పేర్కొన్న అర్మాగెడ్డాన్ (చెడుపై దేవుడి పోరు)ను సృష్టించేందుకు ఇరాన్‌పై దాడి చేయమని ట్రంప్‌కు జీసస్ సందేశం పంపారని కమాండర్ అధికారులకు చెప్పినట్లు రిపోర్ట్ పేర్కొంది.
News March 5, 2026
గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

AP: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులోని అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చే బిల్లుకు నిన్న శాసనమండలిలో ఆమోదం లభించింది. YCP హయాంలో లోపభూయిష్టంగా ఉన్న వ్యవస్ధను పటిష్టంగా తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. వీటితో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.
News March 5, 2026
నిడిగొండలో చాళుక్యుల కాలం నాటి వీరగల్లులు

రఘునాథపల్లి మండలం నిడిగొండ, కురుమగూడెం పొలాల్లో చాళుక్యుల కాలం నాటి వీరగల్లులను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. బృంద సభ్యుడు కెవిజికె ఆచార్య బృందం వీటిని కనుగొనగా, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ శిల్పాల వివరాలను వెల్లడించారు. హైవే పక్కన ఉన్న వెంచర్‌లో విరిగిన వీరగల్లుపై అంతస్తు వీరస్వర్గం శిల్పాలు లభించాయి. ప్రాచీన చరిత్రను చాటిచెప్పే ఈ చారిత్రక ఆధారాలను కాపాడుకోవాలని చరిత్రకారులు కోరారు.


